హైదరాబాద్ నుంచి 30 విమానాలు రద్దు
- July 19, 2024
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలుగుతుండడతో దాని ప్రభావం విమాన సేవలపై భారీగా పడింది.హైదరాబాద్‌లో 30కి పైగా విమానాలు రద్దయినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రయాణికులకు ఢిల్లీ విమానాశ్రయం పలు సూచనలు చేసింది. ఇండిగో, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ తదితర విమాన సంస్థల సేవలకు విఘాతం కలిగిందని అధికారులు అంటున్నారు.
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 వద్ద ప్రయాణికులు భారీ క్యూలైన్లలో నిలబడి కనపడ్డారు.ఎయిర్‌పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ట్వీట్ చేస్తూ..గ్లోబల్ ఐటీ సమస్య కారణంగా ఈ ఎయిర్‌పోర్ట్‌లోని కొన్ని సర్వీసులు తాత్కాలికంగా ప్రభావితమైనట్లు తెలిపింది.
ప్రయాణికులకు కలుగుతున్న ఇబ్బందులకు పరిష్కారం కోసం తమ వాటాదారులందరితో కలిసి పని చేస్తున్నామని చెప్పింది.సబంధిత విమానయాన సంస్థ లేదా అప్‌డేట్ చేసిన విమానాల సమాచారం కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.
మైక్రోసాఫ్ట్ అంతరాయం కారణంగా శుక్రవారం ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌లైన్ కార్యకలాపాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి.పలు దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.విమానయాన సంస్థలు ప్రయాణికులకు సలహాలు సూచిస్తున్నాయి.విమానాశ్రయాల టెర్మినళ్ల లోపల కూడా భారీగా క్యూలు కనిపించాయి.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







