మద్యం తాగి పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం..డ్రైవర్‌కు జరిమానా
- July 20, 2024
మనామా: మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రజా ఆస్తులకు నష్టం కలిగించినందుకు బహ్రెయిన్ కోర్టు ఒక వ్యక్తికి 1,000 బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. నిర్లక్ష్యపు డ్రైవింగ్, పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం కలిగించినందుకు నిందితుడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. కేసు వివరాల ప్రకారం.. షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవేపై ఈ సంఘటన జరిగింది. నిందితుడు మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ మెటల్ అడ్డంకిని ఢీకొట్టాడు. 2014 నాటి ట్రాఫిక్ చట్టం నం. 23లోని ఆర్టికల్ 1/12, 10, 9/45, మరియు 2, 1/51 మరియు క్రిమినల్ ప్రొసీజర్స్ లాలోని ఆర్టికల్ 256 ఆధారంగా కోర్టు నిందితుడికి శిక్ష విధించింది.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







