ఆందోళనలో ఒమన్‌లోని బంగ్లాదేశ్ నివాసితులు..!
- July 22, 2024
మస్కట్: ఒమన్‌లోని బంగ్లాదేశ్ ప్రవాసులు తమ స్వదేశంలో దిగజారుతున్న పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు. అక్కడి నిరసనల్లో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తమ వారితో కమ్యూనికేషన్ కాలేకపోతున్నామని పలువురు బంగ్లాదేశీయులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ డౌన్ మరియు టెలిఫోన్ సేవలు నిలిచిపోవడంతో ఒమన్‌లోని ప్రవాసులు స్వదేశంలో వారి కుటుంబీకుల సంక్షేమం గురించి తెలియక ఆందోళన చెందుతున్నారు. బంగ్లాదేశ్‌లో సివిల్ సర్వీస్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం తన ప్రిఫరెన్షియల్ హైరింగ్ నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల నేతృత్వంలో చేపట్టిన నిరసనలు తీవ్ర హంసకు దారితీశాయి. ఇదిలా ఉండగా, ఒమన్‌లోని బంగ్లాదేశ్ ప్రవాసులు అధికారిక అనుమతి లేకుండా ఎటువంటి ప్రదర్శనలు లేదా సమావేశాలు నిర్వహించవద్దని బంగ్లాదేశ్ సోషల్ క్లబ్ ఒమన్ ఛైర్మన్ సిరాజుల్ హక్ కోరారు.
తాజా వార్తలు
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!







