‘మహానటి‘ కీర్తి సురేష్ కొత్త సినిమా వివాదమేంటో

- July 22, 2024 , by Maagulf
‘మహానటి‘ కీర్తి సురేష్ కొత్త సినిమా వివాదమేంటో

మహానటిగా బోలెడంత ఖ్యాతి దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఈ సినిమాతో అమాంతం కీర్తి సురేష్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించింది.

అలాగే హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌తోనూ ఆకట్టుకుంది కీర్తి సురేష్. అయితే, కొన్ని హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయ్.

అయినా కానీ, మహానటి ఇమేజ్‌కి డ్యామేజ్ ఏమీ రాలేదు సరికదా.. మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కీర్తి సురేష్ పేరు పరిశీలనలు జరుగుతూనే వున్నాయ్.

తాజాగా ‘రఘు తాత’ అనే ఓ ఇంట్రెస్టింగ్ మూవీ సిద్ధమవుతోంది. ఈ సినిమాని తెలుగు, తమిళంతో పాటూ, ఇతర భాషల్లోనూ సిద్ధం చేస్తున్నారు.

అయితే, తాజాగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలూ, డైలాగులూ పొలిటికల్‌గా దుమారం రేపేవిగా వుండబోతున్నాయనీ.. ఆ విషయమై ఒకింత వివాదం రచ్చ రేపుతోంది.

అయితే, కీర్తి సురేష్ మాత్రం ఈ సినిమాలో వివాదం లాగేంత అవసరం ఏమీ లేదనీ, అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా ఆలోచింపచేసేలా ఈ సినిమా వుండబోతోందనీ చెబుతోంది.

ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనీ చెబుతోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నట్లు బాలీవుడ్‌లోనూ ఓ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తోంది. తమిళ బ్లాక్ బస్టర్ ‘తెరి’ మూవీకి హిందీ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com