ఎమర్జెన్సీ లేన్ ఉల్లంఘన.. జైలుశిక్ష, వాహనం సీజ్
- July 23, 2024
కువైట్: ఎమర్జెన్సీ లేన్‌ను దుర్వినియోగం చేస్తే 25 దీనార్‌ల జరిమానాతో పాటు రెండు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఎమర్జెన్సీ వాహనాలకు సేఫ్టీ లేన్ స్పష్టంగా ఉండేలా చూసేందుకు ఎమర్జెన్సీ లేన్‌ను దుర్వినియోగం చేసే వారికి కఠినంగా వ్యవహారించనున్నారు.
సేఫ్టీ లేన్‌లో డ్రైవింగ్ లేదా పార్కింగ్ చేయవద్దని, అత్యవసర వాహనాలకు ఇది ఖచ్చితంగా రిజర్వ్ చేసినట్టు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లోని ట్రాఫిక్ అవేర్‌నెస్ డిపార్ట్‌మెంట్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా బు హసన్ తెలిపారు. నిఘా కెమెరాలు ఉల్లంఘించిన వారిని గుర్తిస్తాయని, వారికి జరిమానాలతోపాటు జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వాహనాలు అకస్మాత్తుగా బ్రేక్‌డౌన్‌లు లేదా ఎమర్జెన్సీ స్టాప్‌లను ఎదుర్కొన్న డ్రైవర్‌లు తమ వాహనాలను వెంటనే సేఫ్టీ లేన్ నుండి దూరంగా తరలించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







