సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తి అరెస్ట్
- July 23, 2024
హైదరాబాద్: డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని టీజీ న్యాబ్, మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి 15 గ్రాముల ఎండీఎంఏ, 22.5 కేజీల గంజాయి, 491 గ్రాముల హ్యాష్ ఆయిల్, 71 నైట్రోజన్ ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ వినీత్ కేసు వివరాలను వెల్లడించారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన షేక్ బిలాల్(28) ఇంటర్ చదివే సమయంలోనే గంజాయికి అలవాటు పడ్డాడు. కరోనా తర్వాత హైదరాబాద్ మాదాపూర్ ఇజ్జత్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ పాత పరిచయాల నేపథ్యంలో అరకు నుంచి గంజాయి తెచ్చి దాదాపు 40.. 50 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్నాడు.పక్కా సమాచారంతో నిందితుడి ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు భాను తేజ జైలులో ఉన్నాడని, అతన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తామని డీసీపీ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







