యూఏఈ నివాసితులను వేధిస్తోన్న అధిక తేమ..!

- July 24, 2024 , by Maagulf
యూఏఈ నివాసితులను వేధిస్తోన్న అధిక తేమ..!

Pic for illustration purpose only

యూఏఈ: యూఏఈలో వేసవి కారణంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు నివాసితులు ఫిర్యాదులు చేస్తున్నారు. దేశంలో పెరుగుతున్న తేమ కారణంగా తన రిఫ్రిజిరేటర్ పాడైపోయిన తర్వాత దాన్ని మార్చే ప్రక్రియలో ఉన్నట్లు దుబాయ్ నివాసి నూరా తెలిపారు. "నేను ఉదయం చూసిన్నప్పుడు ఫ్రిజ్ చల్లబరచలేదు. దాంతో ఆహారమంతా చెడిపోయింది. ఇంట్లో అధిక తేమ వల్ల నష్టం జరిగిందని మెకానిక్ చెప్పాడు. తేమ కారణంగా నా ఇంట్లో ఉన్న ఎయిర్ కండీషనర్‌లలో ఒకటి పాడైపోయింది.’’ అని వెల్లడించారు.

దేశంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న చాలా మంది నివాసితులలో నూరా ఒకరు.  ఎక్కువ తేమ కారణంగా వారి ఇళ్లకు నష్టం వాటిల్లుతోంది. గత రెండు రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో తేమ 80 శాతానికి పైగా నమోదైంది. ఉష్ణోగ్రతలు సగటున 40 డిగ్రీల మార్కులో ఉన్నప్పటికీ, జాతీయ వాతావరణ కేంద్రం తీరప్రాంత మరియు ద్వీప ప్రాంతాలలో 70 శాతం మరియు 95 శాతం మధ్య, అంతర్గత ప్రాంతాల్లో 70 శాతం మరియు 90 శాతం మధ్య తేమ నమోదు అవుతున్నట్లు పేర్కొంది. తాను ఇలాంటి సమస్యను ఎదుర్కొవడం ఇదే మొదటిసారని పలువురు ఎమిరాటీలు తెలిపారు. 

తేమ కారణంగా తమ ఇంటి గోడపై పగుళ్లు ఏర్పడినట్టు మహ్మద్ ఇక్బాల్ తెలిపారు. "నేను సత్వా సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాను. తీవ్రమైన తేమ నా గోడలో పగుళ్లను కలిగించింది. భారీ సీలింగ్ కింద పడింది. అదృష్టవశాత్తూ  అది సోఫాపై పడటంతో ప్రమాదం తప్పింది." అని అతను చెప్పాడు. తాను 12 ఏళ్లుగా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నానని, ఇలాంటి సమస్యను ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని బంగ్లాదేశ్ ప్రవాసుడు చెప్పాడు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com