టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
- July 24, 2024
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేశారు.అక్టోబరు నెలకు సంబంధించిన ఈ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేశారు.అలాగే, తిరుమల, తిరుపతిలో అక్టోబరు నెల గదుల కోటాను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
జూలై 27న శ్రీవారి సేవ కోటా విడుదలవుతుంది. అదే రోజున నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. http://ttdevasthanams.ap.gov.inవెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు. ప్రతి నెల స్వామివారి ఆర్జిత సేవలు, దర్శనాలతో పాటు వసతి గదుల ఆన్లైన్ కోటాను విడుదల చేస్తారు
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







