నేపాల్‌లో కుప్పకూలిన విమానం..సిబ్బంది సహా 19 మంది ప్రయాణం
- July 24, 2024
నేపాల్‌లో కుప్పకూలిన విమానం..సిబ్బంది సహా 19 మంది ప్రయాణం
ఖాట్మాండు: నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. త్రిభువన్ విమానాశ్రయంలో ఓ విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో సిబ్బంది సహా 19 మంది ఉన్నారు. ఈ విమానం పోఖరాకు వెళ్తోంది. ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలియగానే ప్రమాదస్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు. మంటలు చెలరేగడంతో ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను వెలికి తీశారు. విమానం పైలట్ కెప్టెన్ మనీష్ షాక్యాను రక్షించిన సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. టేకాఫ్ సమయంలో విమానం రన్‌వే పైనుంచి జారిపడి కూలిపోయింది. కూలిన విమానం శౌర్య ఎయిర్ లైన్స్‌కు చెందినది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







