అగ్ని ప్రమాద బాధితులకు తక్షణ సహాయం.. షార్జా పాలకుడు
- July 26, 2024
యూఏఈ: షార్జా సివిల్ డిఫెన్స్ ప్రకారం.. అల్ దైద్ నగరంలోని షరియా మార్కెట్‌లో గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో అనేక దుకాణాలు దగ్ధమయ్యాయి. మంటల కారణంగా మార్కెట్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది.
షాపు యజమానులకు భారీ ఉపశమనం కలిగిస్తూ షార్జా పాలకుడు బాధిత వ్యాపారులకు వెంటనే ప్రత్యామ్నాయ దుకాణాలను అందించాలని అధికారులను ఆదేశించారు. షార్జా పాలకుడు మరియు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమీ మూడు రోజుల్లో దుకాణాలు సిద్ధం చేసి బాధితులకు అందజేయాలన్నారు. శాశ్వత మార్కెట్‌ను నిర్మించే ప్రాజెక్ట్‌ను కూడా షేక్ డాక్టర్ సుల్తాన్ ప్రకటించారు. కొత్తగా నిర్మించిన ఈ కాంప్లెక్స్‌లో కాంక్రీటుతో చేసిన 60కి పైగా వాణిజ్య దుకాణాలు ఉంటాయన్నారు. నష్టపోయిన దుకాణ యజమానులకు కొత్త మార్కెట్‌లో కొత్త షాపులతో నష్టపరిహారం చెల్లించాలని, నష్టపోయిన వారికి ఆర్థికంగా నష్టపరిహారం అందించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!
- శ్వాస విధానం నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా? ఆసక్తికర అధ్యయనం..!!
- మస్కట్ విమానాశ్రయంలో ఒమానీ ప్రయాణికులే టాప్..!!
- కువైట్‌లో 48 శాతం తగ్గిన జువైనల్ క్రైమ్స్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా ఫలితాలు.. ఇద్దరికి దక్కిన Dh100,000..!!
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ







