'TNSF' ఉద్యమ కెరటం ఘట్టమనేని వెంకట గణేష్..!
- July 26, 2024
- పోరాటంలో యోధుడు.. ఉద్యమమే అతని ఊపిరి
- పదకొండేళ్లుగా టిడిపి అభివృద్ధికి నిరంతర కృషి
- వచ్చిన జీతంలోనే పార్టీ కోసం పలు కార్యక్రమాలు
- కరోనా సమయంలో సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు
- వైసీపీ హయాంలో కేసులు పెట్టినా తలోగ్గని నైజం
- ఘట్టమనేని సేవలను గుర్తించాలని పలువురి వాదన
అమరావతి: అతనో 29 ఏళ్ళ యువకుడు.. విద్యార్థుల సంక్షేమం, విద్యారంగ సమస్యల పై పోరాడే తత్త్వం అతనిది.. అంతకు మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే విపరీతమైన ఇష్టం.. మంత్రి లోకేష్ కు విధేయుడు.. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి కరుడుకట్టిన అభిమాని.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో అతనో యోధుడు.. తన దృష్టికి వచ్చిన ఎలాంటి సమస్యనైనా అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఘనాపాటి.. విద్యార్థుల సమస్యలతో పాటు రాజధాని రైతుల ధర్నాలలో తనదైన మార్క్.. ఉద్యమమే ఊపిరిగా అనేక పోరాటాలు.. వైసీపీ హయాంలో కేసులు పెట్టినా వెనక్కి తగ్గని నైజం అతనిది.. వచ్చిన జీతంలో కొంత ఇంటికి.. మరికొంత టిఎన్ఎస్ఎఫ్ కి.. అందుకే అంటారు టిఎన్ఎస్ఎఫ్ ఉద్యమ కెరటం ఘట్టమనేనని వెంకట గణేష్ అని.
ఘట్టమనేని వెంకట గణేష్.. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడునియోజకవర్గం పెదకూరపాడు మండలంలోని అబ్బరాజు పాలెం గ్రామం కమ్మ సామజిక వర్గానికి చెందిన భాస్కర రావు రమాదేవి దంపతుల మొదటి కుమారుడు ఘట్టమనేని వెంకట గణేష్. 1996 లో జన్మించాడు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి చిన్నప్పటి నుండి కష్టపడి చదివి డిగ్రీ వరకు విద్యను అభ్యసించాడు. ప్రస్తుతం ఒక కాలేజ్ కి మీడియా కో-ఆర్డినేటర్ గా పని చేస్తున్నాడు గణేష్. ఈ క్రమంలో చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా నారా లోకేష్ అడుగుజాడల్లో నడవడమే లక్ష్యంగా టిడిపి సభ్యత్వం తీసుకుని రాజకీయాల్లో రంగ ప్రవేశం చేశాడు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో పోరాటాలు చేశారు ఘట్టమనేని గణేష్. 2014 నుంచి 2019 వరకు ఉమ్మడి గుంటూరు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, 2021 నుండి నేటి వరకు టిఎన్ఎస్ఎఫ్ స్టేట్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. డిగ్రీ చదివిన గణేష్ ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తూ వచ్చిన జీతంలో సగం ఇంటికి, సగం పార్టీ, విద్యార్థుల కోసం వెచ్చించే వాడని చెబుతున్నారు అతని స్నేహితులు. కరోనా సమయంలో సొంత డబ్బుతో మాస్కులు, నిత్యావసరాలు, మజ్జిగ ప్యాకెట్లు, మెడిసిన్స్, భోజనాలు వంటి ఏర్పాట్లు చేసి శభాష్ అని పించుకున్నారు గణేష్. విద్యార్థులకు ప్రమాదాలు జరిగినప్పుడు సొంత ఆర్థిక సహాయంతో పాటు పలువురి సహకారంతో అండగా నిలిచాడని పేర్కొన్నారు. గత పదకొండేళ్లుగా విద్యార్థులు, పార్టీకి అనేక కార్యక్రమాలు చేసి సక్సెస్ అయ్యారు ఘట్టమనేని. వైసీపీ ఐదేళ్ల పదవి కాలంలో గణేష్ పై పలు కేసులు పెట్టినా భయపడకుండా పార్టీ తలపెట్టిన కార్యక్రమాలను అంతా తానై ముందుండి నడిపించాడు గణేష్. 2019 లో తనతో పాటు తన తండ్రి, తమ్ముడు కూడా పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి శ్రమించి భాష్యం ప్రవీణ్ విజయంలో పాలు పంచుకున్నారు. సుమారు 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో గణేష్ అనేక అటుపోటులను ఎదుర్కొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నుండి గణేష్ కు లాభం కంటే నష్టమే అధికంగా జరిగిందనేని కుటుంబ సభ్యుల వాదన. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోని టీడీపి లో నామినేటెడ్ పదవులను పార్టీ కోసం కష్టబడిన కార్యకర్తలకు ముట్టజెప్పనున్నారు. ఈ నేపథ్యంలో ఘట్టమనేని వెంకట గణేష్ సేవలను గుర్తించాలని టిఎన్ఎస్ఎఫ్ నాయకులు, పలువురు విద్యార్థులు కోరుతున్నారు.


తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









