ఏపీలో మారిన పథకాల పేర్లు

- July 28, 2024 , by Maagulf
ఏపీలో మారిన పథకాల పేర్లు

అమరావతి: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం హయాంలో జగన్ మోహన్ రెడ్డి తనపేరుపై అమలు చేసిన పథకాల పేర్లను కూటమి ప్రభుత్వం మార్చేసింది. ఆ పథకాలకు కొత్త పేర్లను పెట్టింది. వైసీపీ హయాంలో విద్యాశాఖలో అమలుచేసిన పలు పథకాల్లో జగనన్న పేరుతో అమలు చేశారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, మనబడి నాడు -నేడు, స్వేచ్ఛ, జగనన్న ఆణిముత్యాలు వంటి పేర్లతో పథకాలను అమలు చేశారు. ప్రస్తుతం ఆ పథకాల పేర్లను మార్చుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. సదరు పథకాల పెట్టిన నూతన పేర్లను ప్రకటించారు.

మంత్రి నారా లోకేశ్ ఎక్స్ లో పోస్టు ప్రకారం.. అయిదేళ్లపాటు గత ప్రభుత్వం భ్రష్టుపట్టించిన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం. ఇందులో భాగంగా తొలుత గత ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి పేరుతో ఏర్పాటుచేసిన పథకాల పేర్లకు స్వస్తి చెబుతున్నాం. విద్యారంగంలో విశేష సేవలందించిన భరతమాత ముద్దుబిడ్డల పేర్లను ఆయా పథకాలకు నామకరణం చేసి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామని లోకేశ్ తెలిపారు. ఈరోజు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలామ్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్ఫూర్తితో నూతన పథకాల పేర్లను ప్రకటిస్తున్నామని అన్నారు.

పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కు పవన్ అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకొన్నారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళంపాడి విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలు మంచి పరిణామం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

మారిన పథకాల పేర్లు ఇవే.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com