పారిస్ ఒలింపిక్స్‌లో పంచ్ ప‌వ‌ర్ చూపించిన భార‌త బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్

- July 28, 2024 , by Maagulf
పారిస్ ఒలింపిక్స్‌లో పంచ్ ప‌వ‌ర్ చూపించిన భార‌త బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్

పారిస్: పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ పంచ్ ప‌వ‌ర్ చూపించింది. 50 కిలోల విభాగంలో శుభారంభం చేసి 16వ రౌండ్‌లో అడుగుపెట్టింది. ఆదివారం జ‌రిగిన బౌట్‌లో జ‌ర్మ‌నీ బాక్స‌ర్ మాక్సీ క‌రినా క్లొయెట్జ‌ర్‌ ను నిఖ‌త్ చిత్తుగా ఓడించింది. ప్ర‌త్య‌ర్థిపై పంచ్‌ల వ‌ర్షం కురిపించిన తెలంగాణ బిడ్డ‌ను జ‌డ్జిలు ఏక‌గ్రీవంగా విజేత‌గా ప్ర‌క‌టించారు.

ఒలింపిక్స్‌లో క‌ఠినమైన ప్ర‌త్య‌ర్థుల గ్రూప్‌లో ఉన్న నిఖ‌త్ జ‌రీన్ తొలి అడుగు ఘ‌నంగా వేసింది. ఆరంభం నుంచే మాక్సీపై విరుచుకుప‌డింది. దాంతో, మ్యాక్సీ క‌నీసం పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. ఏక‌ప‌క్ష పోరులో నిఖ‌త్ 5-0తో గెలుపొందింది. ఆగ‌స్టు 1న జ‌రిగే త‌ర్వాతి రౌండ్‌లో ఆమె చైనా బాక్స‌ర్ వు యూతో త‌ల‌ప‌డ‌నుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com