వైమానిక దాడిలో హమాస్ చీఫ్ మృతి..!

- July 31, 2024 , by Maagulf
వైమానిక దాడిలో హమాస్ చీఫ్ మృతి..!

టెహ్రాన్: ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సందర్భంగా.. టెహ్రాన్‌లో జరిగిన వైమానిక దాడిలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే మరణించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. "అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఇరాన్‌కు వచ్చిన హనీయే, ఉత్తర టెహ్రాన్‌లోని ప్రత్యేక నివాసంలో ఉండగా  జరిగిన క్షిపణి దాడిలో మరణించాడు." అని ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటలకు (మంగళవారం 22:30 GMT) ఈ దాడి జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com