ప్రవాస చైల్డ్ దేశం విడిచి వెళ్లాలంటే.. తండ్రి ఆమోదం అవసరమా?

- July 31, 2024 , by Maagulf
ప్రవాస చైల్డ్ దేశం విడిచి వెళ్లాలంటే.. తండ్రి ఆమోదం అవసరమా?

కువైట్: ప్రవాస చైల్డ్ దేశం విడిచి వెళ్లేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ కొత్త చర్యను అమలు చేసింది. అరబిక్ మీడియా కథనం ప్రకారం.. బిడ్డ తన తల్లితో లేదా ఏ బంధువులతో వెళ్లినా దేశం విడిచి వెళ్లాలంటే పాస్‌పోర్ట్ శాఖ రూపొందించిన ప్రత్యేక ఆమోద ప్రకటనలో తండ్రి సంతకం అవసరం.నివేదికల ప్రకారం, ఈ కొత్త చర్య వివాహ వివాద సమస్యలను నివారించడానికి ఉద్దేశించబడింది. దేశంలో పిల్లలకి తండ్రి చట్టబద్ధమైన స్పాన్సర్ కాబట్టి, బిడ్డ తల్లితో కలిసి ప్రయాణం చేసినా దేశం వెలుపలికి వెళ్లాలంటే అతని అనుమతి తప్పనిసరి.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com