రామ్ డైరెక్టర్తో రవితేజ సినిమా.!
- August 01, 2024
రామ్ పోతినేని కాంబినేషన్లో వరుసగా మూడు సినిమాలు తెరకెక్కించాడు దర్శకుడు కిశోర్ తిరుమల. అందులో డెబ్యూ మూవీ ‘నేను శైలజ’ అటు రామ్కీ, ఇటు కిషోర్ తిరుమలకు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందించింది.
అదే స్పీడుతో ఆ తర్వాత ‘వున్నది ఒకటే జిందగీ’ సినిమా చేశారు.ఈ సినిమా సో సోగానే ఆడింది. కానీ, ఓ ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పటికీ ఈ సినిమాని టీవీలో వస్తే.. ఆనందంగా వీక్షించే ఆడియన్స్ వున్నారంటే అతిశయోక్తి కాదు.
ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి ‘రెడ్’ సినిమా వచ్చింది ఇదే కాంబినేషన్లో. రామ్ పోతినేని డబుల్ రోల్ పోషించాడు ఈ సినిమాలో. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అసలు మ్యాటర్ ఏంటంటే, ‘రెడ్’ తర్వాత మరో మాస్ స్టోరీ రాసుకున్నాడట కిషోర్ తిరుమల.
ఆ స్టోరీ మీదే రెండేళ్లకు పైగా వర్క్ చేస్తున్నాడు. ఆ స్టోరీ ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ హీరోగా నటించబోతున్నాడనీ తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
ఆగస్టు 15న రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. అలాగే రవితేజ చేతిలో గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ ఒకటి వుంది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







