ఏపీ ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
- August 01, 2024
అమరావతి: పలు కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారికి మరో అవకాశం కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం. 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు సార్వత్రిక విద్యా పీఠం దరఖాస్తులు కోరుతోంది. జులై 31 నుంచి ఆగస్టు 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యా పీఠం డైరెక్టర్ నాగేశ్వరరావు ఓ ప్రటకనలో తెలిపారు. రూ.200 అపరాధ రుసుముతో ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. "తెలంగాణ డీఈఈ సెట్ 2024లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ధ్రువపత్రాల పరిశీలన తేదీలు విడుదలయ్యాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తాం" అని కన్వీనర్ శ్రీనివాసాచారి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







