లోక్‌సభ ప్రజాపద్దుల కమిటీలో మాగుంట,రమేశ్‌, బాలశౌరి

- August 01, 2024 , by Maagulf
లోక్‌సభ ప్రజాపద్దుల కమిటీలో మాగుంట,రమేశ్‌, బాలశౌరి

న్యూ ఢిల్లీ: 15 మంది సభ్యులతో 18వ లోక్‌సభ ప్రజాపద్దుల కమిటీ ఎన్నిక పూర్తయింది. ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

15 మందిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికి అవకాశం లభించింది. కొత్త లోక్‌సభ కొలువుదీరిన తర్వాత ఎన్నిక ద్వారా ప్రజాపద్దుల కమిటీని ఎన్నుకున్నారు. కమిటీలో సభ్యత్వం కోసం 19 మంది ఎంపీలు పోటీపడగా.. చివరి నిమిషంలో నలుగురు సభ్యులు ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో సభ్యులుగా... టీఆర్‌ బాలు, నిషికాంత్‌ దూబే, జగదాంబికా పాల్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, సీఎం రమేష్‌, త్రివేంద్ర సింగ్‌ రావత్‌, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సౌగతరాయ్‌, అపరాజితా సారంగి, అమర్‌ సింగ్‌, తేజస్వీ సూర్య, అనురాగ్‌ ఠాకూర్‌, వి.బాలశౌరి, కేసి వేణుగోపాల్‌, ధర్మేంద్ర యాదవ్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. 2025 ఏప్రిల్‌ 30తో సభ్యుల కాలపరిమితి ముగియనుంది. ఆ తర్వాత మరోసారి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం బులిటెన్‌ విడుదల చేసింది.

కొత్తగా ఎన్నికైన సభ్యులకు అవగాహనా కార్యక్రమం

స్పీకర్‌ ఆదేశాల మేరకు లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఈనెల 9, 10 తేదీల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. సభా వ్యవహారాలు, బడ్జెట్‌ ప్రాసెస్‌, ప్రశ్నలు, అత్యవసర అంశాలు లేవనెత్తడం, డిజిటల్‌ సంసద్‌, ఎంపీ ల్యాడ్స్‌, పార్లమెంట్‌లో స్థాయీ సంఘాలు, పార్లమెంట్‌ ప్రివిలేజెస్‌, సభ్యులకు కల్పించే సదుపాయాలు, పార్లమెంట్‌ సెక్యూరిటీ వంటి అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com