ఎన్టీఆర్‌ భవన్‌కు చంద్రబాబు..పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు

- August 03, 2024 , by Maagulf
ఎన్టీఆర్‌ భవన్‌కు చంద్రబాబు..పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు

అమరావతి: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. ఆయన్ను కలిసి వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారితో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి చంద్రబాబు వినతులు స్వీకరించారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామంటూ పలువురు ఆయనకు వినతులు సమర్పించారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులతో బాధితుల్లా మిగిలామని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కార్యాలయం కిక్కిరిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com