వార్షిక ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన ఖతార్ రైల్

- July 04, 2015 , by Maagulf
వార్షిక ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన ఖతార్ రైల్

పవిత్ర రమదాన్ ఉత్సవాల్లో భాగంగా, ఖతార్ రైల్వే వారు (ఖతార్ రైల్) తమ సిబ్బంది మరియు వారి కుటుంబాలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. దీనిద్వారా తమ సిబ్బంది, వారి కుటుంబాలు, చిన్నారులు స్నేహపూర్వక వాతావరణంలో సన్నిహితమై, అభిప్రాయాలు కలబోసుకుని, జట్టు స్పూర్తిని వారిలో నింపగలమని ఆశిస్తున్నట్టు ఇందులో పాల్గొన్న ఖతార్ రైల్ ఎం. డి. మరియు ఎక్జీక్యూటివ్ కమిటీ ఛైర్మన్ అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ తుర్కీ అల్-సుబేయి మరియు సీ. ఈ .ఓ. అహ్మద్ అల్-ముహన్నదీ చెప్పారు. అనంతరం, సిబ్బంది నిరంతర కఠిన శ్రమకు గుర్తింపుగా వివిధ బహుమతులను వారికి బహూకరించారు.

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com