భద్రతా కారణాలతో 13,763 కార్ ఫోన్ హోల్డర్లు రీకాల్

- August 04, 2024 , by Maagulf
భద్రతా కారణాలతో 13,763 కార్ ఫోన్ హోల్డర్లు రీకాల్

రియాద్:  360-డిగ్రీల రొటేషన్ ఫీచర్‌తో 13,763 కార్ మాగ్నెటిక్ టెలిఫోన్ హోల్డర్‌లను రీకాల్ చేసినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఉత్పత్తులు స్టీరింగ్ వీల్ మధ్యలో అమర్చబడేలా రూపొందించబడినందున రీకాల్ జారీ చేయబడిందని, ఎయిర్‌బ్యాగ్‌ సమస్య కారణంగా ప్రయాణీకుడికి తీవ్రమైన గాయం లేదా మరణం సంభవించవచ్చని హెచ్చరించింది. తక్షణమే ఈ ఉత్పత్తులను ఉపయోగించడం మానేయాలని, వాటిని విక్రేతకు తిరిగి ఇవ్వాలని, పూర్తి రిఫండ్ అందుకోవాలని మంత్రిత్వ శాఖ వినియోగదారులను కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com