దుబాయ్‌లో 3రోజులపాటు 'భారత్ ఉత్సవ్' ఫెస్టివల్
- August 05, 2024
యూఏఈః దుబాయ్‌లో భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రోత్సహించడానికి 'భారత్ ఉత్సవ్ 2' ఫెస్టివల్ మళ్లీ వచ్చింది. ఈవెంట్ ఆగస్టు 15, 16 మరియు 17 తేదీల్లో షేక్ జాయెద్ రోడ్ లోని మెట్రోపాలిటన్ హోటల్‌లో జరుగనుంది. ఈ సందర్భంగా కళ, సాహిత్యం, నృత్యం,గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, ఫ్యాషన్, సినిమా, ఫుడ్ స్టాల్స్, ప్రదర్శనల ద్వారా భారత స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించనున్నారు. గత సంవత్సరం 310 మంది ప్రదర్శనకారులతో 108 కార్యక్రమాలు నిర్వహించగా, 1,500 మందికి పైగా భారత్ ఉత్సవ్‌ను సందర్శించారు.ఈవెంట్ ఆర్గనైజర్ వికాస్ భార్గవ మాట్లాడుతూ..ఈ కార్యక్రమం యూఏఈలో ఉంటున్న భారతీయుల ద్వారా తమ సంస్కృతిని వివిధ కళారూపాల రూపంలో ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం భారత్ ఉత్సవ్ 2 ఎక్సలెన్స్ అవార్డు, వాక్ ఆర్ట్ మరియు భారత్ ఉత్సవ్ పాస్‌పోర్ట్‌లను పరిచయం చేస్తోందన్నారు.మా గల్ఫ్ న్యూస్ ఈవెంట్ మీడియా పార్టనర్ గా ఉంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి