బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా..

- August 05, 2024 , by Maagulf
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా..

ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆర్మీ హెచ్చరికలతో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. రిజర్వేషన్ల విషయంలో బంగ్లాదేశ్ లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో వంద మందికి పైగా మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి..

రిజర్వేషన్ల కోసం బంగ్లాదేశ్ లో గత కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రధాని హసీనా రాజీనామా డిమాండ్ తో నిరసనకారులు రోడ్డెక్కారు. క్రమక్రమంగా ఆ అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. నిరసనల్లో వందల మంది (300 మందికి పైగా అని అధికారిక సమాచారం) మరణించారు. మరోవైపు.. బంగ్లాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆమె సోదరితో కలిసి భారత్ లో ఆశ్రయం కోసం వస్తున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com