బంగ్లాదేశ్‌లోని భారతీయులకు కీలక సూచన

- August 05, 2024 , by Maagulf
బంగ్లాదేశ్‌లోని భారతీయులకు కీలక సూచన

ఢాకా: బంగ్లాదేశ్‌లో వరుసగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితులను భారత్ నిశీతంగా గమనిస్తుంది. బంగ్లాదేశ్‌లో ఆదివారం ఒక్కసారిగా చోటు చేసుకున్న హింసపై భారత్ తనదైనశైలిలో స్పందించింది. అందులోభాగంగా ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కీలక సూచనలు జారీ చేసింది.

రాయబారి కార్యాలయంలో సంప్రదింపులు జరపాలి..

బంగ్లాదేశ్‌లోని భారత రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులందరికీ సూచించింది. అలాగే తాము తదుపరి నోటీసులు జారీ చేసే వరకు బంగ్లాదేశ్‌లో పర్యటించ వద్దని భారతీయులను ఈ సందర్భంగా హెచ్చరించింది. బంగ్లాదేశ్‌లో ఆందోళనలు నేపథ్యంలో జులై 25వ తేదీన 6,700 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

కొద్ది రోజుల క్రితమే ఆందోళన మళ్లీ..

దేశంలో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ బంగ్లాదేశ్‌లోని యూనివర్సిటీ విద్యార్థులు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. వీరి ఆందోళనలకు ప్రజలు సైతం మద్దతు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలతో తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దాంతో కర్ప్యూ సైతం విధించారు. అలాంటి వేళ... విద్యార్థులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఆ క్రమంలో పరిస్థితి చక్కబడుతుందని ప్రజలంతా భావించారు.

దేశవ్యాప్తంగా కర్ఫ్యూ..

కానీ ఆదివారం మళ్లీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.దీంతో విద్యార్థులకు, అధికార హాసీనా పార్టీ మద్దతుదారులకు మధ్య చోటు చేసుకున్న హింసలో 93 మంది మరణించారు.వారిలో 14 మంది పోలీసులు ఉన్నారు. మరోవైపు ఈ హింసలో వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం స్పందించింది. దేశవ్యాప్తంగా కర్ప్యూ విధించింది.అలాగే ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పై విధంగా స్పంధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com