క్వార్టర్ ఫైనల్‌కు భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు..
- August 05, 2024
పారిస్: పారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు రొమేనియాను ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. 16వ రౌండ్ లో రొమానియాను 3-2 తేడాతో ఓడించింది.
ఒలింపిక్స్ TTలో భారత్ ఉమెన్స్ జట్టు క్వార్టర్స్ చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ ఈవెంట్‌లో శ్రీజ, అర్చన, మణిక బృందం అద్భుత ప్రదర్శన చేసి రొమేనియాను ఓడించారు. ఈ ఉత్కంఠ పోరులో ప్రపంచ 11వ ర్యాంకర్ టీమిండియా 3-2తో నాలుగో నంబర్ టీమ్ రొమేనియాపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ జట్టు అమెరికా లేదా జర్మనీతో పోటీ పడే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌లో శ్రీజ, అర్చన జోడీ తొలుత డబుల్స్‌లో అడుగుపెట్టింది. తొలి మ్యాచ్‌లో ఈ భారత జోడీ రొమేనియాకు చెందిన ఎడినా, సమారా జోడీని 3-0తో ఓడించి ముందంజ వేసింది. ఈ భారత జోడీ 11-9, 12-10, 11-7 తేడాతో ఎడినా, సమారాపై విజయం సాధించింది. ఆ తర్వాత.. మణిక తదుపరి మ్యాచ్‌లోకి ప్రవేశించింది. ఆ మ్యాచ్ లో బెర్నాడెట్‌ను 3-0తో సులభంగా ఓడించింది. మణికా 11-5, 11-7, 11-7 తేడాతో బెర్నాడెట్‌ను ఓడించింది. దీంతో భారత జట్టు రొమేనియాపై 2-0 ఆధిక్యంలో నిలిచింది.
తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు మూడో మ్యాచ్‌లో వెనుదిరిగింది. ఎలిజబెత్ సమారాతో జరిగిన ఉత్కంఠ సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీజ ఆకుల ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సమర 3-2తో శ్రీజను ఓడించింది. శ్రీజ, సమర మధ్య జరిగిన మ్యాచ్ లో 8-11, 11-4, 7-11, 11-6, 11-8 తేడాతో సమర గెలిచింది. ఈ మ్యాచ్‌లో శ్రీజ ఓడిపోయినప్పటికీ, రొమేనియాపై భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత.. బెర్నాడెట్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో అర్చన కామత్ 3-1 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో అర్చన 5-11, 11-8, 7-11, 9-11 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో.. భారత్, రొమేనియా మధ్య స్కోరు 2-2తో సమమైంది. కాగా.. చివరి మ్యాచ్‌లో మ్యాచ్ ఫలితం డిసైడ్ అయింది. ఈ మ్యాచ్‌లో మనిక 3-0 (11-5, 11-9, 11-9)తో ఎడినా డియాకానును ఓడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?