అడవి శేష్ ‘గూఢచారి 2’ అడ్వెంచర్స్ అంతర్జాతీయ స్థాయిలో.!

- August 05, 2024 , by Maagulf
అడవి శేష్ ‘గూఢచారి 2’  అడ్వెంచర్స్ అంతర్జాతీయ స్థాయిలో.!

స్టైలిష్ హీరో అడవి శేష్ నటించిన ‘గూఢచారి’ సినిమా సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఆరేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా క్రిటిక్స్‌తో ప్రశంసలు అందుకుంది.

హాలీవుడ్ రేంజ్ సినిమాటోగ్రఫీ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసింది. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ రూపొందుతోంది. ‘జీ2’ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై చాలా కాలంగా అడవి శేష్ వర్క్ చేస్తున్నాడు.

వినయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
మధుశాలినీ, ఇమ్రాన్ హజ్మీ, సుప్రియ యార్లగడ్డ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పై థ్రిల్లర్ కథాంశంతో ఇంతకు ముందెన్నడూ చూడని అడ్వెంచర్ సన్నివేశాలతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

ఖచ్చితంగా ఈ సినిమా ‘గూఢచారి’ని మించిన సక్సెస్ అందుకుంటుందనీ, డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఆడియన్స్‌కి కలుగుతుందనీ అంటున్నాడు అడవి శేష్.
లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి ఆరు స్టైలిష్ స్టిల్స్ రిలీజ్ చేశారు. అన్ని స్టిల్స్‌కీ మంచి రెస్పాన్స్ వస్తోంది. దాదాపు 40 శాతం వరకూ షూటింగ్ జరుపుకున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది సెకండాఫ్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com