IIT మద్రాస్‌కు రూ.228 కోట్ల విరాళం ఇచ్చిన డాక్టర్ కృష్ణ చివుకుల
- August 07, 2024
చెన్నై: ఐఐటీ మద్రాస్‌కు ఓ పూర్వ విద్యార్థి భూరి విరాళం అందజేశారు.1970 ఎంటెక్ ఎయిరో స్పేస్ ఇంజినీరింగ్ బ్యాచ్‌కు చెందిన డాక్టర్ కృష్ణ చివుకుల రూ.228 కోట్ల విరాళం ప్రకటించారు. దేశ చరిత్రలో ఒక విద్యా సంస్థకు ఇంత పెద్ద మొత్తంలో విరాళం లభించడం ఇదే మొదటిసారి. కృష్ణ అందించిన విరాళానికి గుర్తింపుగా ఐఐటీలోని ఒక అకడమిక్ బ్లాక్‌కు ఆయన పేరు పెట్టారు. మంగళవారం జరిగిన ఈ నామకరణోత్సవానికి కృష్ణ చివుకుల, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ-ఎం) చరిత్రలోనే మొదటిసారిగా అత్యధిక వ్యక్తిగత విరాళం ఇచ్చిన వ్యక్తి అమెరికాలో స్థిరపడిన తెలుగుతేజం ఇండో యూఎస్ మిమ్ సంస్థ ఛైర్మన్ కృష్ణా చివుకుల నిలిచారు. తాను చదువుకున్న ఐఐటీకి పరిశోధనల కోసం ఆయన రూ.228 కోట్ల భూరి విరాళం అందజేశారు. మంగళవారం అమెరికా నుంచి చెన్నైకు చేరుకున్న ఆయన.. ఐఐటీ మద్రాసుతో ఒప్పందం పత్రంపై సంతకం చేసి విరాళం అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన కృష్ణా చివుకుల 1968లో బాంబే ఐఐటీ నుంచి బీటెక్.. అనంతరం ఐఐటీ మద్రాస్ నుంచి 1970లో ఎంటెక్ పట్టా పుచ్చుకున్నారు. కాగా, ఐఐటీ మద్రాస్‌కు భారీ మొత్తంలో విరాళం అందజేసిన అనంతరం కృష్ణా చివుకుల మీడియాతో మాట్లాడుతూ.. నా ఆనందం కోసమే ఇదంతా చేస్తున్నట్టు తెలిపారు. ‘ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్ల విరాళం ఇచ్చాను.. దేశంలోని ఏ విశ్వవిద్యాలయానికి కూడా ఒకేసారి ఇంత పెద్దమొత్తం విరాళం వచ్చిన దాఖలా లేదు.. ఇదంతా ఎందుకు చేస్తున్నానని కొందరు నన్ను అడుగుతున్నారు.. నేను ఆనందంగా ఉండాలి.. తద్వారా నా ఆరోగ్యం బాగుండాలి... ఇంతకుమించి నేనేమీ ఆశించడం లేదు’ అని కృష్ణా చివుకుల అన్నారు. ‘‘గత 55 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నాను. అక్కడి యూనివర్శిటీలకు ధనవంతులు దండిగా విరాళాలు అందజేస్తారు.. సమాజంలో విద్య, ఆరోగ్యం మెరుగుపరిచి, పేదరిక నిర్మూలనకు ఆర్థికంగా అండగా నిలబడతారు.. నా దేశానికి సేవ చేయాలనే ఆలోచన నా మనసులో ఎన్నో ఏళ్ల నుంచి బలంగా అనిపిస్తోంది. అమెరికన్లు సైతం ఐఐటీ మద్రాస్ నుంచి వచ్చే ఇంజినీర్లను చూసి ఆశ్చర్యపోతుండటం నేను చూశాను. అలాంటిచోట నేను చదువుకున్నాను. అందుకే నా దాతృత్వ కార్యక్రమాలు ఇక్కడి నుంచే మొదలుపెట్టాలని అనుకున్నాను.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







