సిసోడియాను కలిసిన నారెడ్కో ప్రతినిధి బృందం

- August 07, 2024 , by Maagulf
సిసోడియాను కలిసిన నారెడ్కో ప్రతినిధి బృందం

విజయవాడ: రెవిన్యూ విభాగానికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కుంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని రాష్ట్ర రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. 

నేషనల్ రియల్ ఎస్టేట్ డవలప్ మెంట్ కౌన్సిల్ (NAREDCO) ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో సిసోడియాను కలిసి రియల్ ఎస్టేట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించింది. నారెడ్కో బృందంలో రాష్ట్ర అధ్యక్షుడు గద్దె చక్రధరరావు, సెక్రటరీ జనరల్ సీతారామయ్య, సెంట్రల్ జోన్ అధ్యక్షుడు సందీప్ మండవ, రాష్ట్ర కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కిరణ్ పరుచూరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడె జగన్ తదితరులు ఉన్నారు. ఉన్నారు. ప్రధానంగా నెరెడ్కో ప్రతినిధులు గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ల్యాండ్ పార్శిల్ మ్యాప్ విధానాన్ని రద్దు చేయాలని,  నాలా  (నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్‌మెంట్) పన్ను తగ్గించాలని కోరారు. ఉమ్మడి అభివృద్ధి ఒప్పందం (JDA) కోసం రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపుతో డెవలపర్‌లపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని,  మరిన్ని జాయింట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను ప్రోత్సహించేలా నిబంధనలు రూపొందించాలని కోరారు. వ్యవసాయ భూమిని రెసిడెన్షియల్ ల్యాండ్‌గా మార్చే సమయంలో  పట్టణ ప్రాంతంలో స్క్వేర్ యార్డ్ రేట్ల ఆధారంగా మార్పిడి ఛార్జీలను విధిస్తోందని, దానికి బదులుగా ఎకరాలలో లెక్కించాలని నెరెడ్కో విన్నవించింది. విభిన్న సమస్యలను సానుకూలంగా పరిశీలించిన సిసోడియా అన్ని విషయాలను ముఖ్యమంత్రి దృష్టి తీసుకువెళతామని , ప్రభుత్వానికి అదాయం సమకూరేందుకు కూడా రియల్టర్లు సహకరించాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com