ఎన్టీయార్-ప్రశాంత్ నీల్ ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా.!
- August 07, 2024
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీయార్ చేయాల్సిన సినిమాకి సంబంధించి లేటెస్ట్‌గా అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 9న ఈ సినిమా పట్టాలెక్కనుందన్నదే ఆ ఆప్డేట్ సారాంశం.
మైత్రీ మూవీస్ బ్యానర్‌తో కలిసి ఎన్టీయార్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తోంది. కాగా, ఈ సినిమాకి టైటిల్ కూడా ఫలానా అంటూ ప్రచారం జరుగుతోంది.
గత కొన్నాళ్లుగా ఈ సినిమా స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. దాదాపు స్క్రిప్టు ఫైనల్ అయిపోయింది. ఆగస్టులోనే సినిమా పట్టాలెక్కిస్తామని గతంలోనే చెప్పారు. అందుకు తగ్గట్లుగానే ఆగస్టు 9న ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఈ సారి మాత్రం పక్కా అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీయార్ ‘దేవర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్‌లో ‘వార్ 2’ లోనూ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు.
ఇక, ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రాజెక్ట్‌నీ పట్టాలెక్కించేస్తే.. ఎన్టీయార్ ఫ్యాన్స్‌కి అంతకన్నా కావాల్సిందేముంది.! పండగే పండగ.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







