బంగ్లాదేశ్: హెల్ప్లైన్ నెంబర్లు విడుదల చేసిన భారత హైకమిషన్‌

- August 07, 2024 , by Maagulf
బంగ్లాదేశ్: హెల్ప్లైన్ నెంబర్లు విడుదల చేసిన భారత హైకమిషన్‌

ఢాకా: బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్‌ క్రియాశీలకంగా ఉన్నట్లు అధికారిక వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి. హైకమిషన్‌లోని భారతీయ దౌత్యవేత్తలందరూ విధులు నిర్వహిస్తున్నారని, హైకమిషన్‌ కార్యాలయం పనిచేస్తోందని పేర్కొన్నాయి. అత్యవసరం కాని సిబ్బంది, వారి కుటుంబసభ్యులు స్వచ్ఛంద ప్రాతిపదికన వాణిజ్య విమానంలో బుధవారం తిరిగి వచ్చారని పేర్కొన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్నందున అత్యవసరం కాని సిబ్బంది భారత్‌కు చేరుకుంటున్నారని వెల్లడించాయి.

ఆ దేశంలో ఉన్న భారతీయు గురించి సమాచారం తెలుసుకునేందుకు హై కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఎమర్జెన్సీ నెంబర్‌లను ప్రకటించింది.

హై కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌సిఐ), ఢాకా
ం880-1937400591

అసిస్టెంట్‌ హెచ్‌సిఐ , చిట్టిగాంగ్‌
+880-1814654797
+880-1814654799

అసిస్టెంట్‌ హెచ్‌సిఐ, రాజాషాహి
+880-1788148696

అసిస్టెంట్‌ హెచ్‌సిఐ, సిల్హెట్‌
+880-1313076411

అసిస్టెంట్‌ హెచ్‌సిఐ, ఖుల్నా
+880-1812817799

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com