మొలకెత్తిన మెంతులతో వెయిట్ లాస్.!
- August 08, 2024
స్ప్రౌట్స్ లేదా మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. అనేక వ్యాధులకు ఈ స్ర్పౌట్స్‌తో చెక్ పెట్టొచ్చు.. అని నిపుణులు చెబుతున్నారు. అయితే, శనగలు, పెసలు, కొన్ని రకాల తృణ ధాన్యాలను నానబెట్టి అవి మొలకలు వచ్చాకా తింటుంటాం. ఆరోగ్యమే కాదు, టేస్ట్ కూడా ముఖ్యమే కదా.
సో, పప్పు జాతికి చెందిన పలు తృణ ధాన్యాలు నోటికి రుచికరంగానే వుంటాయ్ కాబట్టి వాటిని తినగలం. లేదంటే, ఇంకాస్త టేస్ట్ యాడ్ అయ్యేలా వాటిని ప్రిపేర్ చేసుకుని కూడా తింటుంటారు కొంతమంది.
కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే మొలకెత్తిన గింజల్ని అస్సలు ఇష్టపడరెవ్వరు. అవే మెంతులు. మెంతులు తినడానికి కాస్త చేదుగా వుంటాయ్. పచ్చళ్లలోనూ అలాగే పుల్లని కూరల్లోనూ మెంతుల్ని వాడుతుంటారు బేసిగ్గా.
అలాగే డయాబెటిస్ పేషెంట్లు కాస్త కష్టమే అయినా మెంతుల పొడిని నీటిలో కలుపుకుని తాగుతుంటారు. కానీ, మొలకెత్తిన మెంతులు తింటే చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది.
ముఖ్యంగా ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునేవాళ్లు ప్రతీరోజూ మొలకెత్తిన మెంతుల్ని తింటే ఖచ్చితంగా ఫలితం వుంటుందని చెబుతున్నారు.
మెంతుల్లో ఫైబర్ కంటెంట్ అది కూడా మొలకెత్తిన మెంతుల్లో చాలా చాలా ఎక్కువగా వుంటుందట. క్యాలరీలు తక్కువగా వుంటాయట. అందుకే వీటిని తినడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతుందని చెబుతున్నారు.
అంతేకాదు, రోగనిరోధక శక్తి పెరిగి, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వుంటారని చెబుతున్నారు. కడుపులో మంట, అల్సర్ల నుంచి ఉపశమనం పొందొచ్చని చెబుతున్నారు.
ఎక్కువ మోతాదులో కాకుండా చాలా తక్కువ మోతాదులో అయినా ప్రతీరోజూ పరగడుపున మొలకెత్తిన మెంతుల్ని తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. జస్ట్ ట్రై ఇట్.!
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







