విక్రమ్ ‘తంగలాన్’ ఈ సారైనా.!
- August 08, 2024వెర్సటైల్ హీరో విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. వాయిదాల పర్వం అనంతరం విడుదలకు సిద్ధమైంది. ఈ ఆగస్టు 15న ‘తంగలాన్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
‘తంగలాన్’ ఓ విభిన్నమైన కథ. పోస్టర్లు, ట్రైలర్లతో ఆసక్తి క్రియేట్ చేసింది. అదే డేట్‌కి ఆల్రెడీ తెలుగు సినిమాలు ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
వాటితో పాటూ కొన్నిచిన్న సినిమాలూ రిలీజ్ అవుతున్నాయ్. అలాగే, ‘తంగలాన్’ వంటి ఓ భిన్న భారీ చిత్రం కూడా. సినిమా కోసం ఎంతకైనా తెగించే విక్రమ్ ఈ సారి కూడా ఈ సినిమాలో విభిన్నంగా కనిపించే ప్రయత్నం చేశాడు.
అలాగే ఈ సినిమాలో విక్రమ్‌తో పాటూ, అందాల భామ క్రేజీ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటించింది. గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మాళవిక, ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్‌లో ఓ విచిత్రమైన మంత్రగత్తె పాత్రలో నటించింది.
ఆమె పాత్ర మరింత ఆసక్తికరంగా డిజైన్ చేసినట్లు ట్రైలర్‌లో చూపించారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు బాగా వున్నాయ్. కేజీఎఫ్ బంగారు గనుల బ్యాక్ డ్రాప్‌లో ఓ ఆసక్తికరమైన కథను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారు. చూడాలి మరి, ఎలాంటి అంచనాలు అందుకోనుందో ‘తంగలాన్’.
తాజా వార్తలు
- IIFA ఉత్సవం.. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం..
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?