ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌తో చిరంజీవి భేటీ
- August 08, 2024
త్రివేండ్రం: వారం రోజుల క్రితం కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌తో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కొండ చరియలు విరిగి పడి 360 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. విపత్తు బాధితులకు అండగా నిలబడేందుకు సినీ పరిశ్రమలోని పలువురు స్టార్స్ ముందుకు వచ్చారు. తన వంతు బాధ్యతగా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌లు సంయుక్తంగా కోటీ రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో నేడు (గురువారం) సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి కేరళకు వెళ్లారు. త్రివేండ్రంలో విమానాన్ని దిగిన వెంటనే చిరు నేరుగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సీఎం విజయన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రూ.కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.
త్రివేండ్రంలో చిరు విమానం దిగిన వీడియోలు, ముఖ్యమంత్రి చెక్కును అందజేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెగాస్టార్ ది మంచి మనసు అని, చెప్పితే ఖచ్చితంగా చేసే వరకు ఊరుకోడు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









