సీఎం రేవంత్ నన్ను కాపాడండి...కువైట్ నుంచి బాధితుడి వీడియో!
- August 08, 2024
కువైట్ సిటీ: తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ బాధితులు విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో సరైన ఉపాధి దొరకక చాలామంది.. యువకులు అలాగే, మిడిల్ ఏజ్డ్ వ్యక్తులు... గల్ఫ్ దేశాలకు వెళుతూ ఉంటారు. ముఖ్యంగా దుబాయ్, సౌదీ లేదా కువైట్ లాంటి ప్రాంతాలకు వెళ్లి తమ జీవనాన్ని కొనసాగిస్తారు.గల్ఫ్ దేశాలకు వెళ్లేటప్పుడు... కొంతమంది బ్రోకర్ల మాటలు విని చాలామంది కార్మికులు మోసపోతున్నారు. ఇండియాలో ఉన్నప్పుడు... మంచి హోటల్లో పని ఇప్పిస్తామని చెప్పి...గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తర్వాత ఎడారిలో ఉంచుతున్నారు. అలా చాలామంది కార్మికులు.. ఏజెంట్ల... చేతిలో దారుణంగా మోసపోవడం జరుగుతోంది.
అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిర్మల వాసి కూడా కువైట్ వెళ్లి మోసపోయాడు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కువైట్ లో తనను కొడుతున్నారని... తీవ్ర అవస్థలు పడుతున్నానని... తాజాగా నిర్మల్ కు చెందిన రాథోడ్ నాందేవ్ అనే వ్యక్తి మొరపెట్టుకున్నాడు. తక్షణమే తనను తెలంగాణ రాష్ట్రానికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతూ... ఓ వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు రాథోడ్ నాందేవ్. తనను స్వదేశానికి తీసుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరాడు.
ముధోల్ మండలం రువి గ్రామానికి చెందిన రాథోడ్ రాందేవ్ గత తొమ్మిది నెలల కిందట కువైట్ వెళ్లాడట. అయితే ఇంట్లో పని అని చెప్పి... ఓ ఏజెంట్ మోసం చేశాడట. కువైట్ వెళ్లిన తర్వాత... ఎడారిలో ఒంటరి కాపరిగా పనిలో పెట్టాడట. ఇలా తనను... ఎడారిలో ఉంచి కొడుతున్నారని ఆ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. మరి ఈ వీడియో పై తెలంగాణ ముఖ్యమంత్రి... రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.
--సాయి కృష్ణ(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!