డీజె టిల్లు కొత్త సినిమా ‘తెలుసు కదా’. ఏమ్ బిల్డప్ ఇచ్చావ్ బ్రో.!
- August 09, 2024
‘డీజె టిల్లు’ సినిమాతో సెన్సేషనల్ అయిన కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ. తర్వాత ‘టిల్లు స్క్వేర్’తోనూ సూపర్ హిట్ కొట్టాడు రీసెంట్‌గా. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’.
ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ గ్లింప్స్‌లో మనోడు సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు సూటూ బూటూ వేసుకుని.
వైట్ కలర్ సూట్‌లో రిచ్ హౌస్‌లో మనోడి ఎంట్రీ.. ‘తెలుసు కదా’ అని ముగించేశాడు. చూస్తుంటే.. ఈ సినిమాని చాలా రిచ్‌గా తెరకెక్కించినట్లు అర్ధమవుతోంది. నీరజ కోన తొలి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. టిల్లుగానిగా రికార్డులు కొల్లగొట్టిన సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ అంటూ మనకు తెలియని ఏ కథని లేదంటే ఆల్రెడీ తెలిసిన కథనే అయినా ఏం కొత్తగా చూపిస్తాడో చూడాలి మరి.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







