ట్రావెల్ ఏజెంట్లతో తస్మాత్ జాగ్రత్త...ఇండియా కాన్సులేట్ వార్నింగ్...!

- August 09, 2024 , by Maagulf
ట్రావెల్ ఏజెంట్లతో తస్మాత్ జాగ్రత్త...ఇండియా కాన్సులేట్ వార్నింగ్...!

అమెరికా: భారత సంతతికి చెందిన వ్యక్తులు తప్పుడు ట్రావెల్ ఏజెంట్లతో జాగ్రత్తగా ఉండాలని న్యూయార్క్ లోని ఇండియన్ కాన్సులేట్ హెచ్చరికలు జారీ చేసింది. వారు కాన్సులర్ సేవలకు అధిక మొత్తంలో డబ్బులను వసూలు చేస్తున్నారని వెల్లడించింది. కొన్ని సందర్భాలలో వారు తప్పుడు పత్రాలను సమర్పిస్తున్నారని తెలియజేసింది. 

ముఖ్యంగా ఓసీఐ కార్డుల సేవలకు భారీగా డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ బినాయ ప్రధాన్ పలు అంశాలను ప్రస్తావించారు. కేవలం 17 డాలర్లు విలువ చేసే ఎమర్జెన్సీ ధ్రువీకరణలకు వారు 450 డాలర్లు చార్జీ చేస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తుదారులు వాస్తవానికి ఎటువంటి ఏజెంట్లను సంప్రదించాల్సిన అవసరం లేదని ప్రధాన్ పేర్కొన్నారు. వారు నేరుగా కాన్సులేట్ లో సంప్రదించవచ్చన్నారు. సేవల కోసం మీరు నేరుగా మా కార్యాలయానికి రావచ్చు. 

దళారులు వారికి ఆదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు. గతంలో దరఖాస్తుదారుల తరపున ఏజెంట్లు తప్పుడు బిల్లులు, ధ్రువీకరణలు, అడ్రస్ లు సమర్పిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలు చివరివరకు దరఖాస్తుదారులకు తెలియజేయడం లేదన్నారు. భారతీయ చట్టాలను ఉల్లంఘించి.... దరఖాస్తుదారులను ప్రమాదంలో పడేస్తున్నారని చెప్పారు. స్కామ్ ల నుంచి తప్పించుకునేందుకు కేవలం ఈ-వీసా వెబ్సైట్ ను మాత్రమే వాడాలని ప్రధాని సూచించారు. దాదాపు 140కి పైగా ఈ-వీసా తప్పుడు వెబ్సైట్లను గుర్తించామన్నారు. ఇవి ప్రభుత్వ సైట్లను తలపిస్తున్నట్లే ఉన్నాయని పేర్కొన్నారు.

--సాయి కృష్ణ(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com