ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ లిస్టింగ్..
- August 09, 2024
ముంబై: ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ స్టాక్ మార్కెట్లో దూసుకుపోతోంది. శుక్రవారం (ఆగస్టు 9) ఓలా షేర్లు అమాంతం లాభాల బాటపట్టాయి. స్టాక్‌మార్కెట్లో లిస్ట్ కావడంతో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 20 శాతం పెరిగాయి. దాంతో కంపెనీ విలువ 4.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఓలా ఎలక్ట్రిక్ బాస్ భవీశ్ అగర్వాల్ వ్యక్తిగత ఆదాయం కూడా ఒక్కసారిగా పెరిగిపోయంది. భవీశ్ సంపద 1.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. తద్వారా భారత్ నుంచి ముఖేష్ అంబానీ, అదానీ వంటి బిలియనీర్ల జాబితాలోకి భవీశ్ కూడా చేరారు. 2024లో ఓలా ఎలక్ట్రిక్ 734 మిలియన్ డాలర్ల ఐపీఓ ఇప్పటివరకు దేశంలోనే అతిపెద్దదిగా నిలిచింది.
ఓలా ఎలక్ట్రిక్ లిస్టింగ్ సందర్భంగా ఈ ఉదయం ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో జరిగిన వేడుకలో భవిష్ అగర్వాల్ భార్య రాజలక్ష్మి అగర్వాల్‌తో కలిసి పాల్గొన్నారు. ఓలా క్యాబ్స్ సీఈఓ, ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు సంప్రదాయ కుర్తా పైజామా ధరించారు. ఆమె పసుపు రంగు చీరను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఓలా ఎలక్ట్రిక్ ట్రేడింగ్ అరంగేట్రంతో ఓలా ఫౌండేషన్‌కు సారథ్యం వహిస్తున్న రాజలక్ష్మి అగర్వాల్ కూడా వేడుకలో పాల్గొనేందుకు వచ్చారు. సాధారణంగా ఆమె బహిరంగ ప్రదేశాల్లో కనిపించడం చాలా అరుదు. ఎన్‌ఎస్ఈలో ఓలా ఎలక్ట్రిక్ లిస్టింగ్ వేడుక నుంచి ఒక ఫొటోను ఓలా బాస్ షేర్ చేశారు.
“ఈరోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ క్షణం నిన్నటివరకు ఒక ప్రక్రియలా అనిపించింది. మన సమయాన్ని వెచ్చించి భారత్‌ను ఒకటిగా మార్చాం. అతిపెద్ద ఈవీ 2వీలర్ మార్కెట్లలో మా కష్టానికి ఫలితం దక్కింది. ఇప్పుడు యావత్ ప్రపంచం గుర్తించింది. కానీ, ఈ రోజు మన ఆకాంక్షలను రెట్టింపు చేయడం ఒక ముఖ్యమైన కర్తవ్యంగా భావిస్తున్నాను. మా గమ్యం ఇంకా చేరుకోలేదు”అన్నారాయన. ఈ పోస్టుకు భవీష్ సతీమణి కూడా రీట్వీట్ చేసింది. బెంగళూరులోని భవిష్ అగర్వాల్ దంపతులు నేతృత్వంలోని కంపెనీ ట్రేడింగ్ వేడుకలో పాల్గొనేందుకు ముంబైకి వెళ్లారు.
ఓలా ఎలక్ట్రిక్ 734 మిలియన్ డాలర్లు ఐపీఓ 2024లో ఇప్పటివరకు భారత్ అతిపెద్ద ఐపీఓగా రాయిటర్స్ నివేదించింది. శుక్రవారం ముంబైలో కంపెనీ ట్రేడింగ్ అరంగేట్రంలో ఒక్కసారిగా షేర్లు 20శాతం పెరిగాయి. ఫలితంగా కంపెనీ విలువ 4.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భవిష్, రాజలక్ష్మి అగర్వాల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ముంబైలో కలుసుకున్నారు. 2007లో భవీశ్‌తో డేటింగ్ చేసిన రాజలక్ష్మి.. ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో విశ్లేషకులు, మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేసేవారు. అయినప్పటికీ ఆమె 2016 నుంచి ఓలా సామాజిక సేవా కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఓలా క్యాబ్స్ స్టార్టప్ ప్రారంభ రోజులలో తన భార్య ఆర్థికంగా ఎలా సపోర్ట్ చేసింది అనేదాని గురించి ఓలా బాస్ గుర్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?