తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు పై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- August 10, 2024
హైదరాబాద్: బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీతో సంప్రదింపులు ఏమీ లేవని చెప్పారు. అలాంటిది ఏదైనా ఉంటే ముందు మీడియాకే చెబుతానంటూ కిషన్ రెడ్డి అన్నారు. సామాజిక అసమానతల కారణంగా దళిత రిజర్వేషన్లు ఇచ్చారు. క్రిమీలేయర్ విషయంలో ఆలోచించమని చెప్పింది తప్ప ఆదేశించలేదు. ప్రస్తుతం ఏ పద్ధతి కొనసాగుతుందో అదే పద్ధతి కొనసాగుతుందని కిషన్ రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ఇళ్లను తీసుకోలేదు. నిన్నటి కేబినెట్ సమావేశంలో పట్టణ ప్రాంతంలో మూడు లక్షల ఇళ్లను తెలంగాణకు మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతంలో ఇళ్లకు సంబంధించి ప్రతిపాదనలు ఇవ్వలేదు. గ్రామీణ ప్రాంత ఇళ్లకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపాదనలు రాగానే ఇళ్లను మంజూరు చేయాల్సిందిగా ప్రధానిని కోరానని అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై పార్టీ అధిష్టానం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నాం. అధ్యక్ష మార్పు అంశం, ఎన్నికల సన్నద్ధతకు సంబంధం లేదని అన్నారు. జమ్ము-కాశ్మీర్ పర్యటనకు త్వరలో వెళ్తున్నాను. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. జమ్ము-కాశ్మీర్లోలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!









