ఖర్జూర ఉత్పత్తిలో సౌదీ అరేబియా రికార్డు..124% వృద్ధి
- August 12, 2024
రియాద్: సౌదీ అరేబియా ఖర్జూరంలో 124% స్వయం సమృద్ధి రేటును సాధించిందని, వార్షిక ఉత్పత్తి 1.6 మిలియన్ టన్నులకు మించిందని పర్యావరణ, నీరు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సౌదీ అరేబియాలో ఖర్జూర సాగు ఇప్పుడు సుమారు 165,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగుతోంది. రియాద్ ప్రాంతం దేశంలోనే అత్యధిక ఖర్జూర ఉత్పత్తిదారుగా ఉందని, వార్షిక ఉత్పత్తికి 436,112 టన్నులు దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖాసిం ప్రాంతం ఏటా 390,698 టన్నుల ఉత్పత్తిని సాధిస్తోంది. తర్వాతి స్థానాల్లో మదీనాలో 263,283 టన్నులు, తూర్పు ప్రాంతం 203,069 టన్నులతో ఉన్నాయి. అల్-జౌఫ్ 65,020 టన్నులు, మక్కా 64,095 టన్నులు, అసిర్ 55,225 టన్నులు, తబుక్ 52,792 టన్నులు, నజ్రాన్ నుండి 9,837 టన్నులు అల్-బాహా 2,969 టన్నులు, నార్తర్న్ బోర్డర్స్ 1,314 టన్నులు, జజాన్ 111 టన్నులతో ఉన్నాయి. ఖర్జూర ఉత్పత్తిలో ఈ విజయం సౌదీ అరేబియా ఈ రంగంలో స్వయం సమృద్ధిని కొనసాగించే సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నది.
తాజా వార్తలు
- దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్‌లో దీపావళి వేడుకలు..
- దుబాయ్‌లో ప్రపంచంలోనే తొలి సిటీ వైడ్ టూరిజం లాయల్టీ ప్రోగ్రామ్ ప్రారంభం
- చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్..జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- భారత్‌లో 1500% పెరిగిన బంగారం అక్రమ రవాణా!
- అర్ధరాత్రి 2.30 వరకు షోలు..చిత్రసీమ కు CM విజయ్ గుడ్ న్యూస్
- మిడ్ టర్మ్ ఎన్నికలు.. అమెరికాలో మొదలైన పోలింగ్
- సైబర్ నేరాల కట్టడికి రాష్ట్రాల మధ్య సమన్వయం కీలకం: డీజీపీ సీవీ ఆనంద్
- విశాఖ మేయర్‌గా ముక్కా శ్రావణి ఎన్నిక!
- దుబాయ్‌లో ఘనంగా గ్లోబల్ దీపావళి వేడుకలు.. ఏడు దేశాల భాగస్వామ్యం
- మక్కా ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చివేసిన సంకీర్ణ దళాలు







