ఈ వారం సినిమాలు బాక్సాఫీస్‌కి కళ కళే.!
- August 12, 2024
ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలేమీ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయాయ్.
మంచి అంచనాల మీద వచ్చిన ‘భారతీయుడు 2’ వంటి సినిమాలు సైతం బొక్క బోర్లా పడ్డాయ్. ఈ వారం బాక్సాఫీస్ వద్ద అనుకోకుండా మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయ్.
అందులో రెండు స్ట్రెయిట్ సినిమాలు. ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ రెండింటి పైనా అంచనాలు బాగానే వున్నాయ్.
వీటితో పాటూ విలక్షణ నటుడు విక్రమ్ నటించిన ‘తంగలాన్’ సినిమా ఒకింత ఆసక్తికరమైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
ఇదో డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. క్రేజీ హీరోయిన్ మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ అమ్మడు నటించిన ఆరతి పాత్ర ఈ సినిమాలో మరింత ఆసక్తికరంగా వుండబోతున్నట్లు ట్రైలర్ కట్ చేశారు.
అలాగే, విక్రమ్ పాత్ర చిత్రీకరణ, కథ, కథనం అన్నీ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయ్. సో, డైరెక్ట్ తెలుగు సినిమాలకు విక్రమ్ ‘తంగలాన్’ గట్టి పోటీనే కానుంది.
అలాగే వీటితో పాటూ మరో రెండు చిన్న సినిమాలు కొత్త నటీనటులతో వస్తున్న ‘ఆయ్’ ఒకటి, నివేదా థామస్ నటించిన ‘35 చిన్న కథ కాదు’ సినిమా ఒకటి ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానున్నాయ్.
ఇండిపెండెన్స్ డేతో పాటూ, శ్రావణ శుక్రవారం సెలవులు తర్వాత వీకెండ్.. ఇలా లాంగ్ వీకెండ్ ఈ సినిమాల్లో ఏ ఏ సినిమాలకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!