కీర్తి సురేష్ రూటే సెపరేటు.! అందుకే ఆమె మహానటి.!
- August 12, 2024
ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ, మరోవైపు సోలోగా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌లో నటిస్తూ చిన్న చిన్న హీరోలను సైతం ఎంకరేజ్ చేస్తోంది మహా నటి కీర్తి సురేష్.
నటుడు, కమెడియన్ కమ్ హీరో సుహాస్‌తో కీర్తి సురేష్ ఓ సినిమాలో నటించింది. అదే ‘ఉప్పు కప్పురంబు’. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం చేసిన సినిమా ఇది.
ఇదో డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, సుహాస్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అయితే ఈ ఇద్దరిదీ పెయిర్ కాదని తెలుస్తోంది. రెండు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న రోల్స్‌లో అత్యంత ఆసక్తికరమైన పాత్రల్లో కనిపించబోతున్నారట.
ఈ సినిమా షూటింగ్ లేటెస్ట్‌గా పూర్తయ్యిందట. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ప్రకటించనున్నారు. అలాగే కీర్తి సురేష్ నటించిన ‘రఘు తాత’ చిత్రం ఈ నెలలోనే ధియేటర్లలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది.
అయితే, స్టార్ హీరోయిన్లు చిన్న హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది గతంలోనూ చూశాం. గతంలో స్టార్ ఇమేజ్ వున్న సిమ్రాన్ తదితరులు కృష్ణ భగవాన్ తదితర నటులతో స్క్రీన్ పంచుకున్నారు.
అలాగే ఈ జనరేషన్ హీరో నవీన్ పోలిశెట్టితో స్టార్ హీరోయిన్ అనుష్క నటించింది. అయితే, ఆ హీరోయిన్లు తమ తమ క్రేజ్ తగ్గిపోయాకా ఆయా నటీ నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
కానీ, కీర్తి సురేష్ అలా కాదు, ప్రస్తుతం ఆమె స్టార్ ఛాన్సులతో దూసుకెళ్తోంది. బాలీవుడ్‌లోనూ హవా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం సుహాస్ వంటి నటుడితో నటించడం గొప్ప విషయమే. అయినా సుహాస్‌ని ఏమంత తక్కువంచనా వేయడానికి లేదండోయ్. ఇంటెన్స్ వున్న నటుడు. ఈ మధ్య ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్’ వంటి సినిమాలతో సూపర్ హిట్లు కొట్టాడు. కథల ఎంపికలో మంచి టేస్ట్ వున్నోడు.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్‌కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్‌లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!