క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇండియాలో మరో కొత్త లీగ్?
- August 13, 2024న్యూఢిల్లీ: ఎప్పుడైతే ప్రపంచ క్రికెట్ లోకి IPL ప్రవేశించిందో.. అప్పటి నుంచి క్రికెట్ రూపురేఖలు మారిపోయాయి అని చెప్పొచ్చు. 2008లో ప్రారంభం అయిన ఐపీఎల్ ను చూసి చాలా దేశాలు లీగ్ క్రికెట్ ను స్టార్ట్ చేశాయి.
అయితే ఆ టోర్నీలు ఐపీఎల్ అంత ప్రాచుర్యాన్ని సంపాదించుకోలేకపోయాయి. కానీ.. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఈ లీగ్ లు ఫ్యాన్స్ కు మాత్రం కిక్కిస్తున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్, కరేబియన్ లీగ్, టీ10 లీగ్, లంక ప్రీమియర్ లీగ్, SA20 లీగ్ ఇలా చాలా దేశాలు లీగ్ క్రికెట్ ను స్టార్ట్ చేశాయి. తాజాగా ఓ న్యూస్ ఇండియన్ క్రికెట్ లో హల్ చల్ చేస్తోంది. త్వరలోనే భారత్ లో మరో కొత్త క్రికెట్ లీగ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఐపీఎల్ తరహాలో ఇండియాలో మరో కొత్త లీగ్ రాబోతుందా? అంటే అవుననే సమాధానాలే క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వరల్డ్ క్రికెట్ లో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ మెగాటోర్నీలో ఆడాలని కలలు కంటూ ఉంటారు స్టార్, యంగ్ క్రికెటర్లు. ఇక ఇప్పుడు అలాంటి ఓ లీగ్ క్రికెట్ మన దేశంలో రాబోతోంది. అయితే ఇది ప్రస్తుతం క్రికెట్ ఆడే వారికి కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజాలకు మాత్రమే. అసలు విషయం ఏంటంటే?
టీమిండియాకు చెందిన కొంత మంది రిటైర్డ్ ప్లేయర్లు బీసీసీఐ కార్యదర్శి జై షా దగ్గరికి వెళ్లి.. రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజాల కొరకు ఓ లెజెండరీ క్రికెట్ లీగ్ ను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. దాంతో ఈ విషయంపై బీసీసీఐ ఆలోచిస్తుందని జై షా సదరు ప్లేయర్లకు చెప్పాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండియన్ క్రికెట్ వర్గాల్లో ఆసక్తిగా మారింది. బీసీసీఐ తలచుకుంటే దిగ్గజ ప్లేయర్ల పేరిట ఓ లీగ్ ను ప్రారంభించగలదు. దాంతో ఇండియాలో మరో కొత్త లీగ్ ప్రేక్షకులకు కిక్కిస్తుంది.
తాజా వార్తలు
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్