కొన్ని ప్రాంతాల్లో వర్షాలు.. 22°Cకి తగ్గిన ఉష్ణోగ్రతలు..!
- August 14, 2024
యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ సూచన ప్రకారం.. వాతావరణం సాధారణంగా పాక్షికంగా మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. బుధవారం తెల్లవారుజామున ఫుజైరా, తూర్పు తీరంలో తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఫుజైరా రోడ్లపై ఉదయం 5.19 గంటలకు వర్షం కురిసిన వీడియోను స్టార్మ్ సెంటర్ షేర్ చేసింది. NCM ప్రకారం.. తేలికపాటి నుండి మోస్తరు గాలులు వీస్తాయని, అరేబియా గల్ఫ్‌లో సముద్రం స్వల్పంగా ఉంటుందన్నారు. ఒమన్ సముద్రంలో అలలు మోస్తరు నుండి కొద్దిగా ఉధృతంగా ఉంటాయి. దేశంలోని పర్వత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 22°Cకి పడిపోతాయని, యూఏఈ లోని అంతర్గత ప్రాంతాల్లో గరిష్టంగా 48°Cకి చేరుకుంటాయి. ఎమిరేట్స్ తీర ప్రాంతాల్లో తేమ స్థాయిలు గరిష్టంగా 85 శాతానికి చేరుకుంటాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







