కల్యాణలక్ష్మి పథకాన్ని... ఇకపై బీసీలకు కూడా
- June 16, 2016
ఇప్పటి వరకు ఎస్ సీ, ఎస్ టీలు మైనారిటీలకు వర్తింప చేస్తున్న కల్యాణలక్ష్మి పథకాన్ని... ఇకపై బీసీలకు కూడా విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపచేస్తూ 2016-17 బడ్జెట్లో చేసిన ప్రకటనకు కార్యరూపం ఇస్తోంది. ఇందుకు సబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పెళ్లికి ముందే వధువు తల్లికి 51 వేల రూపాయలు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. కల్యాణలక్ష్మి పథకానికి మంచి ఆదరణ నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రుకు భారం కాకూడదన్న ఉద్దేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కల్యాణలక్ష్మి పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది.
ముందుగా ఎస్సీ,ఎస్టీలకు కల్యాణలక్ష్మి, మైనారిటీలకు షాదీ ముబార్ పేర్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. బీసీలకు కూడా దీనిని వర్తింపచేయాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు చేసిన విన్నపాన్ని మన్నించిన టీఆర్ఎస్ ప్రభుత్వం 2016-17 వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించింది. బీసీలకు కల్యాణలక్ష్మిపై మార్గదర్శకాలు బీసీలకు కల్యాణలక్ష్మి పథకం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కల్యాణలక్ష్మి పథకాన్ని పాదరదర్శకంగా అమలు చేస్తూ... పేదింటి ఆడపిల్ల కుటుంబంలో ఆనందం నింపాలని కోరారు. కల్యాణలక్ష్మికి ఇంతవరకు రూ.530 కోట్లు వ్యయం ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీ వధువులకు ఈ పథకం అమలు జరుగుతున్న తీరుతెన్నులపై కూడా కేసీఆర్ సమీక్షించారు. ఈ పథకం కింది ఇంతవరకు 530 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తద్వారా లక్షా 4వేల 57 మంది లబ్ధి పొందారు. వీరిలో 44,351 మంది ఎస్సీలు, 25,793 మంది ఎస్టీలు ఉన్నారు. అలాగే 33,913 మంది మైనారిటీ వధువులకు సహాయం అందించారు. బీసీలు, ఓబీసీలకు ఈ పథకాన్ని వర్తింపచేసేందుకు 2016-17 బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు కేటాయించారు. అర్హులందరికీ సహాయం అందిచాలని కేసీఆర్ ఆదేశించారు. అవసరమైతే బడ్జెట్ కేటాయింపుల కంటే ఎక్కువ నిధులు ఇవ్వడానికి కూడా సీఎం అంగీకరించారు. బాల్య వివాహాల నియంత్రణతోపాటు సామాజిక మార్పుకు దోహదంచేసే కల్యాణలక్ష్మి పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని కేసీఆర్ ఆదేశించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







