సౌదీ అరేబియా రాజు గొప్ప మనసు..610 కిలోల నుంచి 63 కిలోలకు తగ్గాడు !

- August 16, 2024 , by Maagulf
సౌదీ అరేబియా రాజు గొప్ప మనసు..610 కిలోల నుంచి 63 కిలోలకు తగ్గాడు !

రియాద్: సుమారు 610 కిలోల బరువుతో ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి ఖలీద్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఖలీద్ సౌదీ అరేబియా కు చెందిన వ్యక్తి. ఖలీదు బరువు 610 కేజీలు. అత్యంత భారీకాయంతో బరువు కారణంగా మూడేళ్లకు పైగా అతడు మంచానికే పరిమితమయ్యాడు. ఇక రోజురోజుకు అతడి ఆరోగ్యం క్షీణించడం, వైద్యానికి ఖర్చులు ఎక్కువ కావడంతో దానిని కుటుంబ సభ్యులు భరించలేకపోయారు. 

ఈ క్రమంలో అతడి పరిస్థితిపై సౌదీ అరేబియా మాజీ రాజు అబ్దుల్లాకు తెలియజేశారు. ఇక సౌదీ అరేబియా మాజీరాజు వెంటనే స్పందించి అతనికి వైద్య సహాయాన్ని అందించారు. నిపుణులైన 30 మంది వైద్యులను ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణలో డైట్ నిబంధనలతో పాటు సర్జరీలు చేయడంతో కేవలం 6 నెలల్లోనే తన బరువును సగానికి పైగా తగ్గాడు. 2023 నాటికి అతని బరువు 542 కేజీలు తగ్గి 63.5 కిలోలకు రావడంతో ఇప్పుడు చలాకీగా తన పనులన్నీ తానే చేసుకుంటున్నాడు. 

కాగా ఒకప్పుడు ఖలీద్ ను ఎక్కడికైనా తరలించాలంటే అతడి కుటుంబానికి చుక్కలు కనిపించేవి. అతడిని ఎక్కడికైనా తీసుకెళ్లడం ఒక ప్రాహసనంలా అనిపించేది. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఖలీద్ చిరునవ్వుతో ఎంచక్కా తన పాటికి తాను తిరగ్గలుగుతున్నాడు. తన పనులన్నీ తానే చేసుకుంటున్నాడు. డాక్టర్లు కూడా ఖలీద్ కు "ది స్మైలింగ్ మెన్" అని ఓ నిక్ నేమ్ కూడా పెట్టారు.

--సాయి కృష్ణ(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com