"బ్రాహ్మణ" విడుదలకు సిద్ధo
- June 16, 2016
"దండు పాళ్యం" చిత్రం అటు కన్నడలోనూ.. ఇటు తెలుగులోనూ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. "దండుపాళ్యం" అనంతరం శ్రీనివాస్ రాజు దర్సకత్వంలో.. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా రూపొందిన "శివం" చిత్రం సైతం అంతే సంచలనం సృష్టించింది. ఆ చిత్రం ఇప్పుడు తెలుగులో "బ్రాహ్మణ" పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది.
సి.ఆర్.మనోహర్ సమర్పణలో..
విజి చెరిష్ విజన్స్ మరియు శ్రీ తారకరామ పిక్చర్స్ బ్యానర్స్ పై.. విజయ్.ఎమ్- గుర్రం మహేష్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుంటూరి కేశవులు నాయుడు సహ నిర్మాత. ఉపేంద్ర సరసన సలోని (మర్యాద రామన్న ఫేం), రాగిణి ద్వివేది హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి సంగీత సంచలనం మణిశర్మ స్వర సారధ్యం వహించడం విశేషం. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ధియేటర్ ట్రైలర్ ను ప్రముఖ కథానాయకులు శ్రీకాంత్-తరుణ్ రిలీజ్ చేయగా.. మరో ట్రైలర్ ను ఏ.ఎం.ఆర్ కన్ స్ట్రక్షన్స్ అధినేత- "షిర్డీ సాయిబాబా" నిర్మాత అయిన గిరీష్ రెడ్డి, క్రిబీ కన్ స్ట్రక్షన్స్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సదానంద్ విడుదల చేశారు.
ట్రైలర్ విడుదల కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు విజయ్.ఎం, గుర్రం మహేష్ చౌదరి, సహ నిర్మాత గుంటూరి కేశవులు నాయుడు, చిత్ర దర్శకులు శ్రీనివాస్ రాజు, ఈ చిత్రాన్ని ఆంధ్రా, తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రముఖ రచయిత తోట ప్రసాద్ లతోపాటు పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ పై ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







