ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ టాప్ 100 సీఈఓలు.. యూఏఈ టాప్..!
- August 18, 2024
దోహా: ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ గత సంవత్సరంలో గణనీయమైన ప్రభావాన్ని చూపిన వ్యాపార నాయకుల జాబితాను విడుదల చేసింది. తన రీజియన్ టాప్ సీఈఓల నాల్గవ వార్షిక జాబితాలో మొత్తం 19 జాతీయతలకు ప్రాతినిధ్యం వహిస్తున్న MENA ప్రాంతంలోని కంపెనీల నుండి 100 మంది CEOలు ఉన్నారు. ఖతార్ ఇంధన వ్యవహారాల మంత్రి, ఖతార్ ఎనర్జీ CEO సాద్ బిన్ షెరిదా అల్ కాబీ .. ఈ సంవత్సరం అత్యంత ప్రభావవంతమైన CEOలలో నాల్గవ స్థానంలో నిలిచారు. QNB గ్రూప్ CEO నాసర్ అబ్దుల్లా ముబారక్ అల్ ఖలీఫా 10వ స్థానంలో ఉన్నారు.
"మా జాబితాలోని చాలా మంది CEOలు ప్రభుత్వ సంస్థల్లో ప్రభావవంతమైన పాత్రలను పోషిస్తున్నారు. టాప్ 10 లీడర్లలో, తొమ్మిది మంది నేరుగా లేదా పరోక్షంగా ప్రభుత్వానికి మెజారిటీ వాటా కలిగి ఉన్న కంపెనీలకు చెందినవారు. టాప్ 10లో ఇద్దరు ప్రభుత్వ మంత్రులు కూడా ఉన్నారు. మరో ఇద్దరు రాజకుటుంబాలకు చెందినవారు." అని ఫోర్బ్స్ పేర్కొంది. జాబితాలో ఎమిరాటీ 27 మంది CEOలతో ముందుండగా.. తర్వాత ఈజిప్షియన్లు 21 మంది, సౌదీలు 14 మంది ఉన్నారు. మొత్తంమీద జాబితాలో 19 మంది నాయకులతో బ్యాంకింగ్ ఇండస్ట్రీ లీడ్ పొజిషన్ సాధించగా.. 10 మందితో రియల్ ఎస్టేట్ రంగం మరియు తొమ్మిది మంది CEOలతో టెలికమ్యూనికేషన్ల రంగాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు







