నాని-సుజిత్ కన్‌ఫామ్ చేసేశాడు.!

- August 18, 2024 , by Maagulf
నాని-సుజిత్ కన్‌ఫామ్ చేసేశాడు.!

నేచురల్ స్టార్‌గా తనకంటూ ఓ స్థాయి స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు నాని. సక్సెస్ వచ్చిందని పొంగిపోలేదు. ఫెయిల్యూర్ వచ్చిందని కుంగిపోలేదు. ‘దసరా’ తర్వాత నానికి వరుస విజయాలు బూస్టప్ ఇస్తున్నాయ్.
అదే జోష్‌తో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. దాదాపు ఏడాదికి రెండు సినిమాలు వుండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
మొన్నీ మధ్యనే ‘హాయ్ నాన్న’ అంటూ వచ్చి కూల్ అండ్ కామ్‌గా హిట్టు పట్టుకెళ్లిపోయాడు. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ సినిమాతో రాబోతున్నాడు.
ఆగస్టు 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మంచి అంచనాలున్నాయ్ ఈ సినిమా మీద. ఈ సినిమా తర్వాత ‘హిట్ 3’ వుంది. దాంతో పాటూ, సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా వుంది.
ఈ సినిమా విషయంలో కాస్త గందరగోళం నెలకొందన్న ప్రచారం జరిగింది. కానీ, పక్కాగా సుజిత్‌తో సినిమా వుంటుందని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో నాని కన్‌ఫామ్ చేశాడు.
సుజిత్‌తో సినిమా అంటే నాని రేంజ్ నెక్స్‌ట్ లెవల్‌కి చేరుకున్నట్లే. అంతేకాదు, ‘సరిపోదా శనివారం’ సినిమా కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందతోన్న సినిమానే. సో, నాని స్టార్‌డమ్ నెక్స్‌ట్ లెవల్‌కి చేరుకోవడానికి ఇంకెంతో టైమ్ పట్టేలా లేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com