కోల్‌కతా హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- August 20, 2024
న్యూ ఢిల్లీ: కోల్ కతాలో వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని దేశ వ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఆసుపత్రిని ధ్వంసం చేస్తున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ను ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది. ఎఫ్ఆర్ఐ నమోదు ఎందుకు ఆలస్యమైందని న్యాయస్థానం ప్రశ్నించింది.
విద్యార్థిని తల్లిదండ్రులకు బలవన్మరణం అని చెప్పింది ఎవరు అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ అంటూ కోర్టు ప్రశ్నించింది. ప్రిన్పిపాల్ రాజీనామా చేసినా వేరే కాలేజీకి ఎందుకు నియమించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విద్యార్థిని తల్లిదండ్రులను 3గంటల పాటు ఎందుకు వెయిట్ చేయించారు. క్రైమ్ సీన్ ను ఎందుకు సీల్ చేయలేక పోయారు? అత్యాచారం, హత్యను బలవన్మరణంగా ఎందుకు చిత్రీకరించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఎందుకు ఆలస్యమైందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బాధితురాలి కుటుంబ సభ్యులు రాత్రి 8.30 గంటలకు ఆమె మృతదేహాన్ని స్వీకరించారు.. రాత్రి 11.45 గంటలకు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతకుముందు ఆసుపత్రి యాజమాన్యం ఏం చేస్తోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఘటనను నిరసిస్తూ జరిగిన ఆందోళనలపై బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. శాంతియుత నిరసనకారులపై అధికారం చెలాయించొద్దని సూచించింది. ఇది దేశమంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం. వైద్యులు, పౌరసమాజాన్ని అడ్డుకోవడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం మందలించింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనపై ఆగస్టు 22వ తేదీ (గురువారం) లోగా నివేదిక సమర్పించాలని సీబీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 22వ తేదీకి వాయిదా వేసింది.
దేశం మొత్తం మీ భద్రత గురించి ఆందోళన చెందుతోందని వైద్య ఆందోళనను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు పేర్కొంది. నేషనల్ టాస్క్ ఫోర్స్ ను నియమిస్తున్నట్లు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో వైద్యుల భద్రతపై అధ్యయనం చేసి సూచనలు ఇవ్వడం దీని పనిఅని తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …