A-నెగటివ్ బ్లడ్ వెంట‌నే కావాలి.. DBBS విజ్ఞప్తి

- August 20, 2024 , by Maagulf
A-నెగటివ్ బ్లడ్ వెంట‌నే కావాలి.. DBBS విజ్ఞప్తి

మస్కట్: బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో A-నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు త‌క్ష‌ణం రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ విభాగం (DBBS) విజ్ఞప్తి చేసింది. ఆ గ్రూప్ రక్త సరఫరా చాలా తక్కువగా ఉన్నందున, వారు త‌క్ష‌ణ‌మే బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేయవలసిందిగా అర్హులైన వ్యక్తులను కోరింది.  శనివారం నుండి గురువారం వరకు ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు, శుక్రవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 వరకు బ్ల‌డ్ డొనేష‌న్ చేయొచ్చ‌ని పిలుపునిచ్చింది. ముంద‌స్తు అపాయింట్‌మెంట్‌ల కోసం  94555648 (WhatsApp) నెంబ‌ర్ లో సంప్ర‌దించాల‌ని కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com